మీరా జాస్మిన్
మీరా జాస్మిన్ | |
---|---|
జననం | జాస్మిన్ మేరీ జోసెఫ్ |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2001–ఇప్పటివరకు |
మీరా జాస్మిన్ జాతీయ పురస్కారం అందుకున్న భారతీయ సినీ నటి. విజయవంతమైన పలు తెలుగు చిత్రాలతో బాటు తమిళ, మలయాళ చిత్రాలలో కూడా నటించింది.
వ్యక్తిగత జీవితము
[మార్చు]ఈవిడా ప్రముఖ సంగీత విద్వాంసుడు మాండోలిన్ రాజేష్ తో ప్రేమాయణం అంటూ వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారంటూ రకరకాల ప్రచారం జరిగింది [1]. ఈమెకు దుబాయ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ టైటస్‌తో తిరువనంతపురంలోని పాలయంకోట్టైలో గల ఎల్‌ఎంస్ చర్చిలో 2014 ఫిబ్రవరి 12 బుధవారం వివాహం జరిగింది. మీరాజాస్మిన్ అనిల్ జాన్ టైటస్ ఫిబ్రవరి 10 2014, సోమవారం రాత్రి 8.30 గంటలకు చట్టబద్ధంగా భార్యాభర్తలయ్యారు. రిజిస్టర్ అధికారి ఒకరు కొచ్చిలోని మీరాజాస్మిన్ ఇంటికి వచ్చి మీరాజాస్మిన్, అనిల్ జాన్ టైటస్‌ల సంతకాలను రిజిస్టర్‌లో పొందుపరిచారు. అదే సమయంలో ఇద్దరు పూలదండలు మార్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇరు కుటుంబాలకు చెందిన అతి ముఖ్యమైన వారు మాత్రమే పాల్గొన్నారు. మీరా జాస్మిన్ వివాహానంతరం నటిస్తానని తెలిపింది.[2][3][4]
నటించిన చిత్రాలు
[మార్చు]తెలుగు
[మార్చు]- అమ్మాయి బాగుంది
- భద్ర
- గుడుంబా శంకర్
- రారాజు (2006 సినిమా)
- ఆకాశ రామన్న
- అ ఆ ఇ ఈ
- బంగారు బాబు
- మా ఆయన చంటి పిల్లాడు
- గోరింటాకు
- యమగోల మళ్ళీ మొదలైంది
- మహారధి
- విమానం (2023)
- శ్వాగ్ (2024)
పురస్కారాలు
[మార్చు]- 2004 : జాతీయ ఉత్తమ నటి - పాదమ్ ఒన్ను ఒరు విలాపం అనే మలయాళ సినిమా కోసం.
మూలాలు
[మార్చు]- ↑ http://entertainment.oneindia.in/tamil/news/2009/meera-jasmine-mandolin-rajesh-290709.html[permanent dead link]
- ↑ http://www.ibtimes.co.in/articles/538217/20140211/actress-meera-jasmine-marriage-wedding-dubai-groom.htm
- ↑ http://www.youtube.com/watch?v=GPDC8nJyWl8
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-02-26. Retrieved 2014-02-12.
బయటి లంకెలు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో మీరా జాస్మిన్ పేజీ